శ్రీ బలభద్రపాత్రుని మధుసూదన గుంటూరు జిల్లా, తెనాలి తాలూకా, చినగాదెలవర్రు గ్రామంలో జన్మించారు. బి.యస్.సి వివేకవర్ధని కాలేజీ, హైదరాబాదులో చదివిన తర్వాత, సాహిత్యాభి రుచి, అభినివేశం గలవాగు కావడం వల్ల, ఉస్మానియా యూనివర్సిటీలో ఎం.ఏ ఇంగ్లీషు లిటరేచర్ చదివారు.

శ్రీ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ లో స్క్రిప్టు రైటింగ్, స్క్రీన్ ప్లే లో సర్టిఫికెట్ కోర్సు చేశారు.

కనులు మూసినా నీవాయే, ఏలెక్స్, ఏప్రిల్ ఫూల్, తొలి పరిచయం లాంటి సుమారు పదిహేను సినిమాలకు గేయ రచన చేశారు. తెలుగు లోను, హిందీలోను వీరు టి.వి ధారావాహికలకు గీత రచయిత. సుమారు వంద తెలుగు సీరియళ్ళకు గీత రచన చేశారు.

తెలుగు టివి సీరియల్ ఋతురాగాలు టైటిల్ సాంగ్ కి 2000 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే నంది పురస్కారం పొందారు. జెమిని టివి, మా టివి అవార్డులు, జీ టివి అవార్డులు కూడా వీరిని వరించాయి.

పత్రికలు, రేడియో, టివి ఛానెల్స్, సినిమాల ద్వారా వీరు ఆంధ్ర పాఠక, ప్రేక్షక లోకానికి పరిచితులు. ప్రణతి వీరి తొలి సంకలనం. ప్రత్యూష వీరి మలి రచన.

 

కిన్నెర పబ్లికేషన్స్

Our Family Members